Bank Janardhan: ఇండస్ట్రీలో త్రీవ విషాదం...కన్నడ హాస్యనటుడు మృతి 8 d ago

ప్రముఖ కమెడియన్ కన్నుమూశారు. కన్నడ హాస్యనటుడు బ్యాంక్ జనార్దన్ (77) మరణించారు. బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 2.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. బ్యాంకులో ఉద్యోగం చేసిన తర్వాత సినిమా రంగంలోకి వచ్చిన ఆయన సుమారు 500 చిత్రాలలో నటించారు. తెలుగులో ‘ఖననం’, ‘రిధం’, ‘లాస్ట్ పెగ్’, ‘ఉపేంద్ర 2’లో కనిపించారు. ఆయన మృతి చిత్ర పరిశ్రమకు తీరనిలోటు. ఆయన చేసిన వినోదాత్మక పాత్రలు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి.